హైదరాబాద్‌లో పైశాచిక ఘటన | Dog Puppies Beheaded in Puranapul Area | Sakshi
Sakshi News home page

Aug 8 2018 8:25 AM | Updated on Sep 29 2018 4:26 PM

Dog Puppies Beheaded in Puranapul Area - Sakshi

కుక్క పిల్లలను క్రూరాతి క్రూరంగా...

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పైశాచిక ఘటన చోటు చేసుకుంది. మూగ జీవి నుంచి పిల్లలను ఎత్తుకెళ్లిన కొందరు దుండగులు.. వాటి తల నరికి చంపారు. పురానాపూల్‌ లోని పార్థివాడ వద్ద ఈ ఘటన చోటు చేసుకోగా.. నిందితులను కఠినంగా శిక్షించాలని తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

స్థానికంగా ఉండే క్రాంతి రాజా అనే వాలంటీర్‌ ఓ కుక్కకు, దాని పిల్లలకి భోజనం పెడుతుంటాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి అవి కనిపించకుండా పోవటంతో చుట్టుపక్కల గాలించాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ సిమెంట్‌ పైప్‌ లైన్‌ల వద్ద ఓ పిల్ల దేహం ముక్కలై పడి ఉండగా.. తల్లి అక్కడక్కడే తిరుగుతూ కనిపించింది. ఓ పైపులో మిగతా మృతదేహాలు పడి ఉన్నాయి. నాలిగింటిని తల నరికి చంపగా.. మరో దానిని చర్మంతో సహా వలిచి ముక్కలుగా నరికారు. ఈ దారుణంపై స్థానిక పోలీసులకు క్రాంతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకోని పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి తీరతామని చెబుతున్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా లేకపోవటంతో నిందితుడిని గుర్తించటం కష్టం మారిందని పోలీసులు చెబుతున్నారు.

రెండు రోజుల క్రితం కొందరు తాగుబోతులు ఆ ప్రాంతంలో వీరంగం సృష్టించగా.. ఆ కుక్క వారిని చూసి మొరిగింది. ఈ కోపంలోనే వాళ్లు ఈ దాష్టీకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహాలను ఖననం చేశాక కూడా ఆ తల్లి శునకం సిమెంట్‌ పైపులైన్‌ల వద్దే తచ్చాడుతూ రోదిస్తుండటం స్థానికులను కలిచివేస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement