యువతిపై 15 వీధి కుక్కల దాడి | A young woman was attacked by 15 street dogs | Sakshi
Sakshi News home page

యువతిపై 15 వీధి కుక్కల దాడి

May 24 2026 12:51 PM | Updated on May 24 2026 3:21 PM

A young woman was attacked by 15 street dogs

యశవంతపుర: బెంగళూరు లో వీధి కుక్కల బెడద రోజురోజుకు అధికమవుతోంది. రోడ్డుపై నడిచి వెళుతున్న మేఘన అనే యువతిపై వీధి కుక్కలు దాడికి యతి్నంచిన ఘటన రామమూర్తి నగరలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హొయ్సళ నగరలో గురువారం రాత్రి యువతి ఫోన్‌లో మాట్లాడుతూ నడిచి వెళుతుండగా 15 వీధి కుక్కలు ఆమెను వెంబడించాయి. తప్పించుకోవడానికి యువతి పరుగులు తీసింది. మేఘన కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు కుక్కలను తరిమివేసి ఆమెను రక్షించారు. ఈ సంఘటనలో ఆమెకు చిన్నచిన్న గాయాలయ్యాయి. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement