అత్తను అమానుషంగా చంపి ఆపై..! | Delhi woman kills mother-in-law in fit of rage | Sakshi
Sakshi News home page

అత్తను చంపి ప్రమాదంగా మార్చబోయి..

Sep 27 2017 3:44 PM | Updated on Sep 27 2017 6:29 PM

Delhi woman kills mother-in-law in fit of rage

కోడలి చేతిలో హత్యకు గురైన స్వర్ణ (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ : అత్తను తానే హత్య చేసి ఓ ప్రమాదంగా చిత్రీకరించబోయి ఓ మహిళ చిక్కుల్లో పడింది. తాను తవ్వుకున్న గోతిలో తానే పడింది. పోలీసులు వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన కంచన్‌ కపూర్‌ (30) అనే మహిళకు తన అత్త స్వర్ణకు(62) ప్రతి రోజు గొడవలు అవుతుండేవి. పైగా ఆమె వికలాంగురాలు.

అయితే, మంగళవారం రాత్రి గొడవ పడిన కాంచన్‌ ఓ బ్యాట్‌లాంటి వస్తువుతో స్వర్ణ తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ విషయం బయటకు పొక్కుతుందనే భయంతో ఓ ప్రమాదంగా చిత్రీకరించే ప్లాన్‌ చేసి ఆమె మృతదేహాన్ని తగులబెట్టే ప్రయత్నం చేసింది. అయితే, మృతదేహం సగం మాత్రమే కాళ్ల వరకే కాలింది. ఈ విషయం బయటకు తెలిసి పోలీసులు ఆమెను విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement