అక్కపై తమ్ముడి కర్కశత్వం!

Delhi Boy Brutal Behaviour With Sister Gouges Her Eyes Out - Sakshi

న్యూఢిల్లీ : తనకు చెప్పకుండా దుస్తులు కొన్న అక్క పట్ల ఓ తమ్ముడు కర్కశంగా ప్రవర్తించాడు. ఆమెను దారుణంగా కొట్టి కనుగుడ్లు చీల్చాడు. అనంతరం ఓ గదిలో ఆమెను  బంధించి తాళం వేశాడు. ఈ పాశవిక ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. బిహార్‌కు చెందిన ఓ యువతి(20) తన తమ్ముడు(17), చెల్లెళ్లతో కలిసి ఢిల్లీలోని ద్వారకాలో నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమె మంగళవారం 100 రూపాయలు ఖర్చు చేసి డ్రెస్‌ కొన్నది. దీంతో కోపోద్రిక్తుడైన ఆమె తమ్ముడు..సదరు యువతి కనుగుడ్లను గోళ్లతో పెకిలించేందుకు ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఓ గదిలో బంధించాడు.

ఈ క్రమంలో రోజూవారీ చర్యలో భాగంగా ఢిల్లీ మహిళా కమిషన్‌ సభ్యులు ఇంటింటిని దర్శిస్తున్న సమయంలో ఈ విషయం గురించి తెలుసుకున్నారు. యువతి ఇంట్లోకి వెళ్లి ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా ఆమె తమ్ముడు అడ్డుపడ్డాడు. మహిళా కమిషన్‌కు చెందిన పంచాయతీ సభ్యులను అభ్యంతకరంగా దూషిస్తూ... దాడి చేస్తానని బెదిరించాడు. అయినప్పటికీ వారు లోపలికి ప్రవేశించి యువతి దగ్గరకు వెళ్లారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం బిహార్‌లో ఉన్న యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. చికిత్స పూర్తయిన తర్వాత కుమార్తెను స్వస్థలానికి తీసుకువెళ్తామని తెలిపారు.

కాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ స్వాతి మలివాల్‌ ట్వీట్‌ చేశారు. రాఖీ పండుగకు ముందు ఓ సోదరుడు ఎలాంటి బహుమతి ఇచ్చాడో చూడండి అని బాధితురాలి ఫొటోలను షేర్‌ చేశారు. సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పినట్లు పేర్కొన్నారు. ఇక సదరు యువకుడు ఎల్లప్పుడూ ఇలాగే ప్రవర్తిస్తాడని, అక్కాచెల్లెళ్లను తరచూ తిడుతూ తీవ్రంగా కొడతాడని ఇరుగుపొరుగు వారు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top