యువకుడి తల నరికి.. కుడి చేతి వేళ్లను.. | Dalit Young Man Assassinated In UP | Sakshi
Sakshi News home page

దళిత యువకుడి దారుణ హత్య

May 18 2020 5:04 PM | Updated on May 18 2020 5:28 PM

Dalit Young Man Assassinated In UP - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అతడి తలను ఇటుకపై పెట్టి, వేరుచేసినట్లు..

లక్నో : పొలానికి వెళ్లిన దళిత యువకుడి తలను శరీరంనుంచి వేరుచేసి, చేతి వేళ్లను నరికి అతి క్రూరంగా చంపేశారు గుర్తు తెలియని కొందరు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేహ్‌పుర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫతేహ్‌పుర్‌కు చెందిన ప్రమోద్‌ కుమార్‌ అనే 22 ఏళ్ల దళిత యువకుడు ఆదివారం 12 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్లాడు. 2:30 గంటల ప్రాంతంలో తల వేరు చేయబడ్డ అతడి శవాన్ని అటుగా వెళుతున్న కొందరు గుర్తించారు. ఆ వెంటనే కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి కుడి చేతి వేళ్లను మూడింటిని తొలగించి ఉండటం గమనించారు. అంతేకాకుండా అతడి తలను ఇటుకపై పెట్టి, వేరుచేసినట్లుగా వారికి ఆనవాళ్లు లభించాయి.

దీనికి తోడు ప్రమోద్‌ సెల్‌ఫోన్‌ సైతం కనిపించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కుమారుడికి ఎవరితోనూ శత్రుత్వం లేదని మృతుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు 10మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముగ్గురి కంటే ఎక్కువమంది ఈ హత్యలో పాల్గొని ఉంటారని వారు భావిస్తున్నారు. ( భారీ అగ్ని ప్రమాదం: ఏడుగురు సజీవ దహనం )

Advertisement
 
Advertisement
Advertisement