ప్రతీ ఒక్కరితో మంచిగా ఉంటూ.. | Couple arrest cheating case and fraud assets | Sakshi
Sakshi News home page

నకిలీ ఆస్తి పత్రాలతో బురిడీ

Dec 18 2017 6:02 AM | Updated on Jul 10 2019 8:00 PM

Couple arrest cheating case and fraud assets - Sakshi

నరేశ్, మధుర

మైసూరు: నకిలీ ధ్రువపత్రాలతో బ్యాంకులు, ప్రైవేటు చిట్‌ఫండ్‌ సంస్థల్లో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న దంపతులను ఆదివారం మైసూరు నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెంగళూరు నగరానికి చెందిన నరేశ్, మధుర దంపతులు కొద్ది కాలం క్రితం మైసూరు నగరంలోని కువెంపునగర్‌కు చేరుకున్నారు. ప్రతీ ఒక్కరితో మంచిగా ఉంటూ నమ్మకం కలిగించారు. ఈ క్రమంలో వ్యాపారం ప్రారంభిస్తున్నామని, అందుకు బ్యాంకుల్లో షూరిటీ ఇవ్వాలని అదే ప్రాంతానికి చెందిన అరవింద్‌ అనే వ్యక్తి వీరి మాటలు నమ్మి తన తల్లి పేరుతో షూరిటీ ఇవ్వడానికి అంగీకరించాడు.

దీంతో కర్ణాటక బ్యాంకు నుంచి రూ. 2 కోట్లు రుణం తీసుకున్నారు. అనంతరం వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు అరవింద్‌కు నోటీసులు పంపించారు. కంగారుపడిన అరవింద్‌ విచారణ చేస్తే దంపతులు బ్యాంకుకు అందించిన ఆస్తి పత్రాలు నకిలీవని తేలింది. దీంతో అరవింద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దంపతులను అరెస్ట్‌ చేసి విచారణ చేయగా ఇదే తరహాలో మరికొంత మందిని రూ. 3 కోట్ల మేర మోసగించినట్లు తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement