కారును అడ్డగించి భర్త కళ్లెదుటే..

Couple Abducted Woman Raped By Men In Ludhiana - Sakshi

చండీగఢ్‌ : పంజాబ్‌లోని లుథియానాలో దారుణం చోటుచేసుకుంది. ఓ జంటను అపహరించిన దుండగులు వారిని తీవ్రంగా కొట్టి, మహిళపై సామూహిక  లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది. శనివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఓ జంట కారులో వెళుతుండగా, ఐదుగురు వ్యక్తులు కారుపై రాళ్లు రువ్వి అడ్డగించారు.

కారులో నుంచి జంటను బయటకు లాగి సమీపంలోని ఫాంహౌస్‌కు తీసుకువెళ్లారు. కారులో వ్యక్తిని తీవ్రంగా కొట్టి రూ 2 లక్షలు ఇవ్వాలని పట్టుబట్టారు. బాధితుడు తన స్నేహితుడికి ఫోన్‌ చేసి డబ్బు తీసుకురావాల్సిందిగా కోరారు. బాధితుడి స్నేహితుడు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఘటనపై పోలీసులకు సమాచారం అందించినా ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకోవడంలో విఫలమవడంతో నిందితులు మరో ఏడుగురిని అక్కడికి పిలిపించి మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో ముల్లన్‌పూర్‌ దఖా పోలీసులు గుర్తుతెలియని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాగా విధినిర్వహణలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధిత జంట డిమాండ్‌ చేస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top