పట్టపగలే చైన్‌ స్నాచింగ్‌ | chain snatching in medak | Sakshi
Sakshi News home page

పట్టపగలే చైన్‌ స్నాచింగ్‌

Feb 27 2018 9:17 AM | Updated on Feb 27 2018 9:17 AM

chain snatching in medak - Sakshi

దొంగలు ఎత్తుకెళ్లగా మిగిలిన చైన్‌ ,బాధితురాలు అనూష

జోగిపేట(అందోల్‌): జోగిపేట పట్టణంలో పట్ట పగలు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు ఇలాఉన్నాయి. వాసవీనగర్‌లో నివాసం ఉంటున్న కొన్యాల అనూష జాతీయ రహదారి పక్కన ఉన్న దుకాణానికి వెళ్లి తన భర్తకు టిఫిన్‌ ఇచ్చి తిరిగి వస్తోంది. ఇంటికి దగ్గరలోనే ఇద్దరు యువకులు బైక్‌పై ఆమెను వెంబడించారు.

ముందుకు వెళ్లిన వారు వాహనాన్ని మలుపుకొని ఎదురుగా వచ్చి అనూష మెడలో నుంచి బంగారు చైన్‌ను తెంపే ప్రయత్న చేశారు. ఆమె ప్రతిఘటించడంతో దొంగల చేతికి కొంత భాగం మాత్రమే దక్కింది. అనూష మాట్లాడుతూ తన మెడలో మూడు తులాల బంగారు చైన్‌ ఉందని, ఎదురుగా వచ్చి దుండగులు లాగుతున్న క్రమంలో తాను చైన్‌ను గట్టిగా పట్టుకున్నాని చెప్పింది. దీంతో కొంత భాగం సుమారుగా అర్ధ తులం చైన్‌ను లాక్కెళ్లినట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement