బోడుప్పల్‌లో చైన్‌స్నాచింగ్‌ | chain snatching in hyderabad | Sakshi
Sakshi News home page

బోడుప్పల్‌లో చైన్‌స్నాచింగ్‌

Oct 25 2017 1:31 PM | Updated on Sep 4 2018 5:07 PM

సాక్షి, మేడ్చల్ : నగరంలోని బోడుప్పల్‌ లో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోయారు. పాఠశాలకు వెళ్లిన చిన్నారులకు మధ్యాహ్నం భోజనం ఇవ్వడానికి వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండుగులు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఈ సంఘటన బోడుప్పల్‌ శ్రీనివాసనగర్‌ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది.

గణేష్‌ నగర్‌ కాలనీకి చెందిన వి. పద్మ(40) జేజీఆర్‌ పాఠశాలలో చదువుతున్న తన పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఇవ్వడానికి నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 4 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు స్నాచర్ల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సమీప ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫూటేజీల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement