బాలికపై అత్యాచారయత్నం..పోలీస్‌పై కేసు | Case Filed Against Kerala Cop For Sexual Assault Bid On Girl In Train | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారయత్నం..పోలీస్‌పై కేసు

Feb 13 2019 10:25 PM | Updated on Feb 13 2019 10:25 PM

Case Filed Against Kerala Cop For Sexual Assault Bid On Girl In Train - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం: కదులుతున్న రైల్లో పదిహేడేళ్ల బాలికపై అత్యాచార యత్నం చేయబోయిన ఓ పోలీసుపై రైల్వే పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. నిందితుడు కేరళ రాష్ట్రం విజిలెన్స్‌ డిపార్ట్‌మెంటులో పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్న దిన్షాద్‌(38)గా గుర్తించారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

రెండు వారాల క్రితం రైలు తిరువనంతపురం సరిహద్దున ఉన్న సష్టంకొట్టా వద్దకు వచ్చినపుడు బాలిక పట్ల నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు ఆధారంగా తెలిసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ప్రస్తుతం నిందితుడు దిన్షాద్‌ పరారీలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement