వీఆర్వోపై దాడి నలుగురిపై కేసు నమోదు | Case File on VRO Attack Case | Sakshi
Sakshi News home page

వీఆర్వోపై దాడి నలుగురిపై కేసు నమోదు

Apr 25 2019 8:06 AM | Updated on Apr 25 2019 8:06 AM

Case File on VRO Attack Case - Sakshi

వీఆర్వోపై దాడికి పాల్పడుతున్న మహిళ

అల్వాల్‌: ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారిపై దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులపై అల్వాల్‌ పోలీస్‌లు కేసు నమోదు చేశారు. సీఐ మట్టయ్య, అల్వాల్‌ తహసీల్ధార్‌ సరళ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖానాజీగూడ గ్రీన్‌ఫిల్డ్స్‌లోని ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతున్నట్లు సమాచారం అందడంతో తహసీల్ధార్‌ సరళ ఆదేశాల మేరకు సిబ్బంది, వీఆర్‌వో శ్రీదేవి అక్కడికి వెళ్లగా ఆక్రమణలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులు వీఆర్వో శ్రీదేవిపై దాడికి పాల్పడ్డారు.  వీఆర్వో ఫిర్యాదు మేరకు అల్వాల్‌ పోలీసులు సుజాత, క్రిష్ణవేణి, శ్రీలత, రవి కుమార్‌లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement