రోడ్డు ప్రమాదంలో కిరాణవ్యాపారి మృతి | Business man killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కిరాణవ్యాపారి మృతి

Mar 20 2018 12:39 PM | Updated on Apr 3 2019 8:03 PM

Business man killed in road accident - Sakshi

మృతుడు పెద్దయ్య

రామన్నపేట (నకిరేకల్‌) : రోడ్డు ప్రమాదంలో కిరాణవ్యాపారి మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం రామన్నపేట శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన వీర్లపాటి పెద్దయ్య(45) గ్రామంలో కిరాణవ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం కిరాణాసామాను కొనుగోలు చేసేందుకు తన బైక్‌పై రామన్నపేటకు వెళ్లాడు. మధ్యాహ్నం సామాను తీసుకుని దుబ్బాకకు వెళ్తుండగా.. రామన్నపేట శివారులోని మూలమలుపువద్ద ఎదురుగా వస్తున్న టాటామ్యాజిక్‌ వాహనం ఢీకొట్టింది.

దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని 108లో రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించి మృతిచెందాడు. పెద్దయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య రమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి.నాగన్న తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement