
స్కూల్ బస్సు ప్రమాదంలో మృతిచెందిన నందిని (ఫైల్)
షాద్‌నగర్ రంగారెడ్డి : చిన్నారుల పాలిట స్కూల్ బస్సులు శా పంగా మారాయి. ఆభం శుభం తెలియని చిన్నారు ల జీవితాలను నిర్లక్ష్యపు చక్రం మొగ్గదశలోనే తుం చేస్తోంది. అనుభవం లేని డ్రైవర్లు, బస్సుల్లో సరైన హెల్పర్లు లేకపోవడంతో చిన్నారులు మృత్యు ఒడి లోకి చేరుతున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గ పరిధి లో సంవత్సరన్నర కాలంలో స్కూల్ బస్సుల కార ణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మరొ కరు తీవ్రంగా గాయపడ్డారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 80 ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిలో 130కి పైగా స్కూల్ బస్సులు నడుస్తున్నాయి.
మృత్యు వాహనాలు..
చిన్నారుల పాలిట స్కూల్ బస్సులు మృత్యువాహనాలుగా తయారయ్యాయి. పాఠశాల యాజమాన్యాల నిర్లక్ష్యం, హెల్పర్ డ్రైవర్‌కు సరైన సూచన చేయకపోవడం, బస్సు నడిపే డ్రైవర్‌కు సరైన అనుభవం లేకపోవడం వీటి ఫలితంగా చిన్నారులు స్కూల్ బస్సు టైర్ల కింద నలిగిపోతున్నారు. గతేడాది షాద్‌నగర్ పట్టణ శివారులోని నాగులపల్లి రోడ్డులో విద్యార్థులను పాఠశాలకు చేరవేసేందుకు ఆగి ఉన్న స్కూల్ బస్సులో వద్దకు నందిని (03) అనే చిన్నారి ఆడుకుంటూ వెళ్లింది.
హెల్పర్ చెప్పకపోవడంతో డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో చిన్నారి బస్సు వెనుక టైరు కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. 2017 జూన్ 4న నందిగామ మండల పరిధిలోని రంగాపూర్ నుంచి సల్వేంద్రగూడకు బయల్దేరిన స్కూల్ బస్సు కిందపడి అక్షిత్ అనే చిన్నారి తీవ్ర గాయాలపాయ్యాడు. అదే విధంగా కేశంపేట మండల పరిధిలోని వేములనర్వ గ్రామంలో ఓ చిన్నారి స్కూల్ బస్సు దిగింది. టిఫిన్ బాక్సు బస్సు కిందకు వెళ్లిందని బాక్స్ కోసం ఆ చిన్నారి బస్సు కిందకు వెళ్లింది. డ్రైవర్ గమనించకపోవడంతో బస్సు చక్రాలు చిన్నారి మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
పట్టించుకోని అధికారులు
స్కూల్ బస్సులను ప్రతి సంవత్సరం ఫిట్‌నెస్ పరీక్షలు, మరమ్మతులు చేయించాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంపై ఉంటుంది. బస్సు న డిపే డ్రైవర్‌కు కనీసం ఐదు సంవత్సరాల అనుభ వం ఉండాలి. ఒక హెల్పర్ బస్సులో ఖచ్చితంగా ఉండి తీరాలి. కొన్ని పాఠశాల యాజమాన్యాలు స్కూల్ బస్సులో హెల్పర్ లేకుండా టీచర్‌ను, లేక పాఠశాల అటెండర్‌ను ఉంచుతున్నారు.
నియోజకవర్గం లో దాదాపు 10కి పైగా బస్సులు ఫిట్‌నెస్ లేకుండానే తిరుగుతున్నాయని సమాచారం. విష యం తెలిసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
బస్సుతో పాటు డ్రైవర్ కండీషన్ ముఖ్యం
స్కూల్ బస్సులో డ్రైవర్‌తో పాటు తప్పకుండా హెల్పర్ ఉండి తీరాలి. ఏ చిన్న పొరబాటు జరి గినా విద్యార్థుల ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. అదే విధంగా పాఠశాల యాజమన్యా లు వారి బస్సులను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. డ్రైవర్ కండీషన్‌ను కూడా చెక్ చేసుకోవాలి. అప్పుడు ప్రమాదాలు జరుగవు.
– పినపాక ప్రభాకర్, షాద్‌నగర్