
సాక్షి, జోగులాంబ గద్వాల : ఇటిక్యాల మండలం కొండేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా మరో 40 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.