సొంత అన్న లైంగికదాడి.. చెల్లెలి ఆత్మహత్య

Brother Molested Sister In Khammam Girl Died - Sakshi

సాక్షి, కొత్తగూడెం: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సొంత అన్నయ్యే తనపై లైంగిక దాడికి పాల్పడటంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన పాల్వంచలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. బాధితురాలిని పిప్పిడి వెంకటి-రాధమ్మ దంపతుల చిన్న కూతురు భూమికగా గుర్తించారు. ఆమెకు ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా తమ బంధువుల వివాహ వేడుకకు వెళ్తూ.. కూతురు భూమికను పాత పాల్వంచలోని తన అన్నయ్య రాంబాబు ఇంటిలో వదిలి వెళ్లారు. కాగా రాంబాబు చెల్లెలిని రాత్రి జ్యోతినగర్‌లోని తన తల్లిదండ్రులు నివాసం ఉంటున్న ఇంటికి తీసుకుని వెళ్లాడు. తండ్రి తర్వాత తండ్రిలా రక్షణగా ఉంటాడనుకున్న అన్నయ్యే కామాంధుడిగా మారి చెల్లెలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆవేదన చెందిన ఆ యువతి అవమానంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలో రోడ్డుపైకి వచ్చిన భూమికను స్థానికులు గమనించి పాల్వంచ ఆసుపత్రికి తరలిచించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కొత్తగూడెం ప్రభుత్వం ఆసుపత్రికి బాధితురాలిని తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

కాగా బాధితురాలిపై సొంత అన్నతో పాటు అతడి స్నేహితుడు కూడా బలత్కారం చేశాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా ఇటీవల ఖమ్మం జిల్లాలో తండ్రి కూతురిపై అత్యాచారం చేసిన ఘటన మరువకముందే.. సొంత అన్నయ్య చెల్లెలిపై అత్యాచారం చేయడం స్థానికులను కలిచివేస్తుంది. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కామాంధుల్లో మార్పు రాకపోవడం.. పైగా రక్తసంబంధాలు, వావి వరసలు మరిచిన అఘాత్యాలకు పాల్పడుతున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top