దుస్తులు విప్పేయ్‌.. చంపేస్తా...

Bangalore Cab Driver Forces Lady to Strip, Arrested - Sakshi

సాక్షి, బెంగళూరు: సిలికాన్‌ సిటీలో మరో దారుణం వెలుగుచూసింది. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న యువతితో డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తించటమే కాకుండా.. ఆమె దుస్తులిప్పించి నగ్న ఫోటోలను తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే యువతి ధైర్యం చేసి ఫిర్యాదు చేయటంతో ఆ డ్రైవర్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

బెంగళూరుకు చెందిన ఆర్కిటెక్ట్‌(26) ఈ నెల 2వ తేదీన ముంబైకి ప్రయాణమైంది. క్యాబ్‌ బుక్‌ చేసుకుని ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది. అయితే షార్ట్‌ కట్‌ అంటూ మార్గం మధ్యలో మార్గం మళ్లించిన డ్రైవర్‌ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. కారు డోర్లు బిగించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఫోన్‌ లాక్కుని లొంగకపోతే తన స్నేహితులను పిలిచి గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడతానని హెచ్చరించాడు. యువతి ప్రతిఘటించటంతో చివరకు దుస్తులిప్పాలని.. లేకపోతే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి వాటిని వాట్సాప్‌ ద్వారా డ్రైవర్‌ తన స్నేహితులకు షేర్‌ చేశాడు. విషయం బయటికి చెబితే ఆ ఫోటోలను ఫేస్‌బుక్‌లో వైరల్‌ చేస్తానని బెదిరించి.. చివరికి ఆమెను ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసి వెళ్లిపోయాడు. 

అయితే యువతి మాత్రం ధైర్యం చేసి ముందుకొచ్చింది. పోలీసులకు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ అరుణ్‌ను వెంటనే అరెస్ట్‌ చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అరుణ్‌ని.. డ్రైవర్‌గా నియమించినందుకు సదరు క్యాబ్‌ కంపెనీకి పోలీసులు నోటీసులు పంపారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన క్యాబ్‌ సంస్థ.. తమ వైపు నుంచి కూడా అతనిపై చర్యలు తీసుకుంటామని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు ఓ ప్రకటనలో  పేర్కొంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top