కన్నతల్లిపై కుమారుడి హత్యాయత్నం | attempt to murder on mother | Sakshi
Sakshi News home page

కన్నతల్లిపై కుమారుడి హత్యాయత్నం

Dec 8 2017 8:11 PM | Updated on Sep 2 2018 4:37 PM

attempt to murder on mother - Sakshi

కరీంనగర్‌ : చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లినే హతమార్చబోయాడో ఓ కుమారుడు. రాగంపేట గ్రామానికి చెందిన సత్తమ్మ(50)కు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు రాజిరెడ్డి(30) ఉన్నారు. కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి వరకట్నం కింద కొంత భూమిని వారికి ఇచ్చింది. ఆ భూమి విషయంలో కుమారుడు రాజిరెడ్డి, తల్లి సత్తమ్మతో కొంతకాలంగా గొడవపడుతున్నాడు.

ఇదే విషయమై శుక్రవారం తల్లితో గొడవపడి కొబ్బరి బోండాల కత్తితో స్వంత మామిడితోటలోనే హత్యాయత్నం చేశాడు. స్థానికులు అడ్డుకోవడంతో సత్తమ్మ ప్రాణాలతో బయటపడింది. ఘటన అనంతరం రాజిరెడ్డి పరారయ్యాడు. సత్తమ్మను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement