రెవెన్యూ అధికారులపై రాళ్ల దాడి

Attack On The Revenue Officers With Stones In Kotagiri - Sakshi

నిజామాబాద్ : కోటగిరి మండలం సుంకిని వద్ద మంజీరా నదిలో రెవెన్యూ అధికారులపై మహారాష్ట్రకు చెందిన 50 మంది రాళ్ల దాడి చేశారు. మంజీర నదిలో  తెలంగాణ భూభాగంలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రెవన్యూ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.  మహారాష్ట్ర కాంట్రాక్టర్‌కు చెందిన జేసీబీలను బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి సీజ్‌ చేశారు.

దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్‌ అనుచరులు తహసీల్దార్ విఠల్‌తో పాటు రెవెన్యూ అధికారులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు రెవెన్యూ అధికారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాళ్ల దాడితో భయపడిపోయి వెనక్కి తగ్గటంతో డోజర్ జేసీబీలను మహారాష్ట్ర కాంట్రాక్టర్ అనుచరులు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top