పెళ్లయిన మూడు రోజులకే భార్యపై ఘాతుకం | Assam women Gang Raped Allegedly By Husband And Friends | Sakshi
Sakshi News home page

స్నేహితులతో కలిసి భార్యపై ఘాతుకం

Apr 24 2018 2:51 PM | Updated on Jul 23 2018 8:49 PM

 Assam women Gang Raped Allegedly By Husband And Friends - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గువహటి : పెళ్లయిన మూడు రోజులకే తాళికట్టిన భార్యపై భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. తాను కోరినంత కట్నం ఇవ్వలేదనే కారణంతో భార్యపై తన ఇద్దరు స్నేహితులతో కలిసి లైంగిక దాడికి తెగబడ్డాడు. దక్షిణ అస్సాంలోని కరీంగంజ్‌లో ఈనెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు భర్తను అరెస్ట్‌ చేసి మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధిత మహిళ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరడంతో ఈ దారుణం పోలీసుల దృష్టికి వచ్చింది.

బంగారు ఆభరణాలను కట్నంగా ఇవ్వాలని తన భర్త కోరగా, తమ కుటుంబం ఇవ్వలేకపోవడంతో తన ఇద్దరు స్నేహితులతో కలిసి భర్త తనపై లైంగిక దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. కథువా, ఉన్నావ్‌ ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో అస్సాంలో మైనర్‌ బాలికలపై లైంగిక దాడులు, వేధింపులు పెరిగాయి. గత రెండు నెలలుగా అస్సాంలో ఈ తరహా కేసులు దాదాపు 20కి పైగా నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement