మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బ్రెయిన్ డెడ్ | AR Constable Arrested In Female Software Engineer Case | Sakshi
Sakshi News home page

ఏఆర్ కానిస్టేబుల్ నిర్వాకం.. యువతి బ్రెయిన్ డెడ్

Apr 4 2018 8:33 PM | Updated on Apr 8 2019 8:33 PM

AR Constable Arrested In Female Software Engineer Case - Sakshi

బాధితురాలు తేజస్విని (ఫైల్‌ ఫొటో)

సాక్షి, విజయవాడ : ఏఆర్ కానిస్టేబుల్ మద్యం మత్తులో చేసిన ప్రమాదం ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబాన్ని కుదిపేసింది. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయి జీవచ్ఛవంలా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మద్యం మత్తులో బైక్ నడిపి ప్రమాదానికి కారణమైన ఆ కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. తేజస్విని చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో విజయవాడకు వచ్చిన తేజస్విని, సోదరుడితో కలిసి బైక్‌పై వెళ్తోంది. ఏఆర్ కానిస్టేబుల్ రూపంలో వీరికి ప్రమాదం ముంచుకొచ్చింది. పీకలదాకా మద్యం సేవించి మత్తులో బైక్ నడిపిన ఏఆర్ కానిస్టేబుల్.. బాధితులు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టాడు. తీవ్రగాయాలపాలైన తేజస్వినిని, ఆమె సోదరుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిని పరీక్షించిన వైద్యులు తేజస్వినికి బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. ఆమె సోదరుడికి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఏఆర్ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement