‘వాడి ఏడుపు వినలేకపోయాను.. అందుకే’

An American Mother Kill Her Son Because She Did Not Want To Hear Her Son Cry - Sakshi

వాషింగ్టన్‌ : అమ్మా ఆకలి.. అమ్మా కడుపు నొప్పి అంటూ నోరు విప్పి చెప్పలేని పసిప్రాయం. తమకు ఏం జరిగినా ఏడుపు ద్వారానే వెల్లడిస్తారు చిన్నారులు. కానీ ఏడుపే ఆ చిన్నారి పాలిట యమపాశమయ్యింది. ఏడుస్తున్న బిడ్డను సముదాయించాల్సిన తల్లి కాస్తా బిడ్డను కడతేర్చింది. విషాదమేంటంటే ఇంటర్నెట్‌లో వెతికి మరి బిడ్డను చంపింది ఈ కసాయి తల్లి. ఈ విచారకర సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

అరిజోనా(19) అనే యువతి నెల రోజుల క్రితం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ దురదృష్టావశాత్తు ఆ చిన్నారి పుట్టుకతోనే అనారోగ్యంతో జన్మించాడు. దాంతో ఆ పసివాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడు. అయితే పిల్లాన్ని సముదాయించాల్సిన తల్లి కాస్తా ఆ చిన్నారి ఏడుపు వినలేక బాత్‌టబ్‌లో ముంచి చంపేసింది. అనంతరం ఆ పసివాడి మృతదేహాన్ని ఓ బ్యాగ్‌లో కుక్కి సమీపంలోని పార్క్‌లో వదిలేసి వచ్చింది. తర్వాత ఏం తెలియనట్లు తన బిడ్డను ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులకు ఫోన్‌ చేసింది.

కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసలకు అరిజోనా మీద అనుమానం రావడంతో నిలదీశారు. అందుకు అరిజోనా తన కుమారుడు జారీ నీళ్లతొట్టిలో పడి చనిపోయాడని బుకాయించింది. కానీ ఆమె సెల్‌ఫోన్‌ పరిశీలించిన పోలీసులు అరిజోనానే హంతకురాలిగా గుర్తించారు. బిడ్డను చంపడానికి ముందు అరిజోనా ఇంటర్నెట్‌లో ‘అనుమానం రాకుండా చంపడం ఎలా.. కేసు నుంచి తప్పించుకునే మార్గాలు ఏంటి’ అనే అంశాల గురించి సర్చ్‌ చేసింది.

దాంతో అరిజోనాను అరెస్ట్‌ చేసి విచారించిగా అసలు విషయం బయటకొచ్చింది. కొడుకు ఏడుపు వినలేక తానే ఆ చిన్నారిని బాత్‌టబ్‌లో ముంచి చంపేసినట్లుగా అరిజోనా నేరం అంగీకరించింది. నా కొడుకుకు సంబంధించి ఏ అచ్చటా.. ముచ్చటా చూడలేదు. ఈ నేరం చేసిన నా భార్యను జీవితాంతం జైలులోనే ఉంచాలి. అప్పుడే ఆమెకు నా బిడ్డ పడిన వేధన అర్థమవుతుంది అంటూ చిన్నారి తండ్రి విలపిస్తున్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top