తప్పిపోయిన అమెరికా టూరిస్ట్‌​, తిరిగి గోవాలో.. | America Tourist Missing And Return To Goa From Maharashtra | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన అమెరికా టూరిస్ట్‌​: తిరిగి గోవాలో..

Nov 9 2019 4:36 PM | Updated on Nov 9 2019 5:57 PM

America Tourist Missing And Return To Goa From Maharashtra - Sakshi

పనాజీ: గత నెలలో అదృశ్యమైన అమెరికన్‌ టూరిస్ట్‌ తిరిగి గోవా తిరిగి వచ్చింది. వివరాల్లోకి వెళితే ....గత నెల 24న గోవాలో జరిగిన యోగా ఉత్సవాల్లో పాల్గొడానికి కుటుంబ సభ్యులతో సహా ఇరవై యేళ్ల ఎలిజబెత్‌ భారతదేశానికి వచ్చారు. బీచ్‌కు సమీపంలో ఓ హస్టల్‌లో ఆమె ఉంటున్నారు. కాగా అంజునా బీచ్‌ చూడటానికి హాస్టల్‌ నుంచి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీసులను కుమార్తె తప్పిపోయినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎలిజబెత్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అనూహ్యంగా ఎలిజబెత్‌ మన్‌ శనివారం తిరిగి గోవాకి రావటంలో పోలీసులు....  ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.

గోవాకి తిరిగి వచ్చిన ఎలిజబెత్‌ తన వద్ద ఫోన్‌, ఇతర ఏ వస్తువులు లేకుండా మహారాష్ట్రాలోని పంచగాని ప్రాంతానికి టాక్సీ ద్వారా వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వద్ద నుంచి వాంగ్మూలం తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక ఎలిజబెత్‌ మన్‌ క్షేమంగా తిరిగి రావడంలో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో పాటు తమ కుమార్తెను వెతకటంకోసం ఫేస్‌ బుక్‌లో ఓ గ్రూప్‌ను క్రియేట్‌ చేశామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement