సుప్రీంకోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు షాక్‌! | ACB Court Will Starts Trial On Chandrababu Illegal Assets Case | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు షాక్‌!

Apr 26 2019 12:04 PM | Updated on Apr 26 2019 8:54 PM

ACB Court Will Starts Trial On Chandrababu Illegal Assets Case - Sakshi

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చంద్రబాబుపై మళ్లీ విచారణ ప్రారంభం కానుంది.

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తిరిగి విచారణ ప్రారంభం కానుంది. 2005లో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ జరపాలని నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. కాగా దేశవ్యాప్తంగా దీర్ఘకాలంగా ఉన్న స్టేలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు తెచ్చుకున్న స్టే రద్దయింది.

దీంతో హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు కేసు విచారణను మళ్లీ మొదలుపెట్టింది. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకావాలని లక్ష్మీపార్వతికి సమన్లు జారీ అయ్యాయి. దీంతో ఆమె శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. కేసు స్టేటస్‌పై వచ్చేనెల 13న హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement