కాశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌: ముగ్గురు మిలిటెంట్ల హతం | 3 LeT militants killed in encounter in south Kashmir | Sakshi
Sakshi News home page

కాశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌: ముగ్గురు మిలిటెంట్ల హతం

Dec 5 2017 9:33 AM | Updated on Dec 5 2017 11:31 AM

3 LeT militants killed in encounter in south Kashmir - Sakshi

సాక్షి,శ్రీనగర్‌: ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడికి బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు మంగళవారం దక్షిణ కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. కాల్పుల ఘటన నుంచి తప్పించుకున్న మరో మిలిటెంట్‌ను అనంత్‌నాగ్‌ జిల్లాలోని ఓ మెటర్నిటీ ఆస్పత్రి నుంచి అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు.

జమ్మూ శ్రీనగర్‌ హైవేపై వెళుతున్న ఆర్మీ కాన్వాయ్‌పై కాజీగండ్‌ వద్ద మిలిటెంట్లు కాల్పులు జరపడంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ మిలిటెంట్‌ హతమయ్యాడు. ఈ క్రమంలో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని గాలింపు చర్యలు చేపట్టడంతో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకూ ఎన్‌కౌంటర్‌ కొనసాగినట్టు సమాచారం. మరణించిన మిలిటెంట్లను యావర్‌ బాసిర్‌, అబు ఫర్ఖన్‌, అబు మవియలుగా గుర్తించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement