జివా.. గానం.. ధోని మురిపెం | Ziva Dhoni singing a Malayalam song | Sakshi
Sakshi News home page

జివా.. గానం.. ధోని మురిపెం

Oct 25 2017 9:37 AM | Updated on Oct 25 2017 9:58 AM

Ziva Dhoni singing a Malayalam song

సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని గారాల పట్టి జివా.. సోషల్‌ మీడియాకు కూడా ముద్దుల పట్టిగా మారింది. ఈ మథ్యే తండ్రితో కలిసి లడ్డూ తినే వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. వచ్చీరానీ పదాలు.. చిట్టిచిట్టి మాటలతో ధోనీ అభిమానులను, క్రికెట్‌ ప్రియులను సైతం అలరిస్తోంది. తాజాగా మలయాళంలోని శ్రీకృష్ణుడిమీద విన్న భక్తి గీతాన్ని... తన ముద్దుముద్దు మాటలతో పాడుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటిదాకా లక్షన్నర మంది వీక్షించారు. వేల సంఖ్యలో అభిమానుల కామెంట్లు పెడుతున్నారు. మలయాళంలో జివా పాను విన్న వారంతా.. అధ్భుతంగా పాడిందని కితాబిచ్చారు.  కేరళ ధోనీ అబిమానులైతే.. ఇది పండుగ చేసుకోవాల్సిన విషయం అని కామెంట్లు పెడుతున్నారు.
 

@mahi7781 @sakshisingh_r ❤️❤️

A post shared by ZIVA SINGH DHONI (@zivasinghdhoni006) on

Advertisement
 
Advertisement
Advertisement