తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | normal rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Jan 13 2018 8:16 AM | Updated on Jun 2 2018 2:59 PM

సాక్షి, తిరుపతి: తిరుమలలో  శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం మొత్తం 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 4 గంటలు, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.

శుక్రవారం శ్రీవారిని 55,963 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,339 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.09 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement