షావోమి ‘ఎన్‌95’ మాస్కుల పంపిణీ

Xiaomi to donate lakhs of N95 masks across Delhi And Punjab - Sakshi

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘షావోమి’.. భారత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాలు, పోలీసులకు అత్యంత నాణ్యత కలిగిన ఎన్‌95 మాస్కులను పంపిణీ చేస్తోంది. వైరస్‌ కారణంగా వీటి ధర 18 రెట్లు వరకు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో ఈ మాస్కులను ఉచితంగా పంపిణీ చేస్తూ కంపెనీ తన దాతృత్వాన్ని చాటుకుందని ప్రభుత్వ ఉన్నత అధికారి ఒకరు సోమవారం మీడి యాకు తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వాలకు ఈ వారంలో మాస్కులు, రక్షణ జాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను జైన్‌ ఉద్యోగులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top