‘వావ్‌’ : రూ.13 వేలకే అమెరికా టికెట్‌

WOW Air to enter India, offers Rs 13,499 fare for 15 North American cities - Sakshi

భారత్‌లో ‘వావ్‌’ ఎయిర్‌ సేవలు

అతి తక్కువ ధరలకే  టికెట్లు ఆఫర్

డిసెంబర్‌లో  అమెరికా, యూరప్‌లకు  సర్వీసులు

సాక్షి, న్యూఢిల్లీ: ఐస్‌లాండ్‌కు చెందిన విమానయాన సంస్థ ‘వావ్‌ ఎయిర్‌’  భారత విమాన ప్రయాణీకులకు బంపర్‌ ఆపర్‌ ఇస్తోంది. త్వరలోనే భారత్‌లో  కార్యకలాపాలకు రెడీ అవుతోంది. డిసెంబర్‌ నుంచి ఢిల్లీ నుంచి రెక్జావిక్‌ (ఐస్‌లాండ్‌ రాజధాని) మీదుగా ఉత్తర అమెరికా, యూరప్‌లలోని వివిధ ప్రాంతాలకు సర్వీసులను ప్రారంభిస్తామని ప్రకటించింది. రెక్జావిక్‌లోని కెఫ్లావిక్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఉత్తర అమెరికా, యూరప్‌లోని ఇతర ప్రాంతాలకు తన సేవలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, బోస్టన్, చికాగో,  టొరొంటోలాంటి 15నగరాలకు విమాన  సేవలను అందించనున్నట్టు చెప్పారు.

అతి తక్కువ ధరల్లో రూ.13,499 బేసిక్‌ ఫేర్‌తో (పన్నులు సహా) టికెట్‌ను (వన్‌వే ప్రయాణానికి) ఆఫర్‌ చేస్తున్నామని  వావ్‌ పేర్కొంది.  అయితే ఈ ధరకు బ్యాగేజ్‌ చెకింగ్‌, ఫుడ్‌ ఖర్చులు అదనమని తెలిపింది. అలాగే ప్రీమియం టికెట్‌ ధర రూ.46,599 నుంచి  ప్రారంభమౌతుందని వావ్‌ ఎయిర్‌ ఫౌండర్‌, సీఈవో స్కల్‌ మోజెన్సెన్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 7వ తేదీనుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ ద్వారా  సేవలు ప్రారంభమవుతాయని  ప్రకటించారు. ఈ మేరకు  వారానికి ఐదు స్లాట్లు పొందేందుకు  ఇప్పటికే జీఎంఆర్‌తో  డీల్‌ కుదుర్చుకున్నట్టు చెప్పారు. ప్రతి రోజు  ఇండియా, ఉత్తర అమెరికా  మధ్య సుమారు 20వేల మంది ప్రయాణిస్తారనీ, ఇంత భారీ డిమాండ్‌ ఉన్న భారత్‌లో తక్కువ ధరకే  అంతర్జాతీయ టికెట్లను అందిస్తున్న  మొట్టమొదటి  ఎయిర్లైన్స్ తమదేనని మోజెన్సెస్‌ చెప్పారు. చమురు ధరలు 100 డాలర్లు దాటిపోయినా తమకు ఎలాంటి ఆందోళనలేదని  పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top