కొత్త వెస్పా@ రూ. 76,495 | Vespa S scooter launched at Rs 76,495 | Sakshi
Sakshi News home page

కొత్త వెస్పా@ రూ. 76,495

Mar 6 2014 1:59 AM | Updated on Jul 11 2019 6:33 PM

కొత్త వెస్పా@ రూ. 76,495 - Sakshi

కొత్త వెస్పా@ రూ. 76,495

ఇటాలియన్ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ పియాజియో మంగళవారం తన మూడవ వెస్పా బ్రాండ్ ప్రీమియం సెగ్మెంట్ స్కూటర్ ‘వెస్పా ఎస్’ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.

ముంబై: ఇటాలియన్ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ పియాజియో మంగళవారం తన మూడవ వెస్పా బ్రాండ్ ప్రీమియం సెగ్మెంట్ స్కూటర్ ‘వెస్పా ఎస్’ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ ఈ స్కూటర్‌ను విడుదల చేశారు. కంపెనీ దీని ధరను రూ. 76,495 (ఎక్స్-షోరూమ్, ముంబై)గా నిర్ణయించింది.

 ప్రత్యేకతలు: 125 సీసీ ఇంజిన్ సామర్థ్యం. డిస్క్ బ్రేక్స్, ట్యూబ్‌లెస్ టైర్స్, సింగిల్ పీస్ స్టీల్ మోనోకాక్ చాసిస్. నాలుగు రంగుల్లో లభిస్తుంది.

 త్వరలో మరిన్ని లగ్జరీ స్కూటర్లు...: భారత్‌లో వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా అత్యంత విలాసవంతమైన విస్పా స్టేబుల్, విస్పా 946 మోడళ్లను విడుదల చేయనున్నట్లు పియాజియో వెహికల్స్ చైర్మన్ రవి చోప్రా చెప్పారు. వీటి ధరల శ్రేణి రూ. 8-9 లక్షలు ఉండొచ్చని తెలిపారు. బహుశా రానున్న రెండుమూడు నెలల్లో ఇవి మార్కెట్‌లోకి అందుబాటులోకి రావచ్చన్నారు. దేశీయ మార్కెట్‌లో ప్రవేశించిన రెండేళ్లలోనే పియాజియో 70,000 వెస్పా స్కూటర్లను విక్రయించింది.

Advertisement
 
Advertisement
Advertisement