breaking news
Vespa S scooter
-
కొత్త రంగుల్లో వెస్పా ఎస్ఎక్స్ఎల్
పుణే: వాహన తయారీ సంస్థ పియాజియో.. వెస్పా ఎస్ఎక్స్ఎల్ వేరియంట్లలో కొత్తగా నాలుగు రంగులను పరిచయం చేసింది. వీటిలో మిడ్నైట్ డిసర్ట్, టస్కనీ సన్‌సెట్, జేడ్ స్ట్రీక్, సన్నీ ఎస్కపేడ్ ఉన్నాయి. ఇప్పటికే ఇవి మార్కెట్లో లభ్యం అవుతున్నాయని కంపెనీ తెలిపింది. ధర తెలంగాణ ఎక్స్‌షోరూంలో రూ.1.32 లక్షల నుంచి రూ.1.51 లక్షల వరకు ఉంది. చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
కొత్త వెస్పా@ రూ. 76,495
ముంబై: ఇటాలియన్ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ పియాజియో మంగళవారం తన మూడవ వెస్పా బ్రాండ్ ప్రీమియం సెగ్మెంట్ స్కూటర్ ‘వెస్పా ఎస్’ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ ఈ స్కూటర్‌ను విడుదల చేశారు. కంపెనీ దీని ధరను రూ. 76,495 (ఎక్స్-షోరూమ్, ముంబై)గా నిర్ణయించింది. ప్రత్యేకతలు: 125 సీసీ ఇంజిన్ సామర్థ్యం. డిస్క్ బ్రేక్స్, ట్యూబ్‌లెస్ టైర్స్, సింగిల్ పీస్ స్టీల్ మోనోకాక్ చాసిస్. నాలుగు రంగుల్లో లభిస్తుంది. త్వరలో మరిన్ని లగ్జరీ స్కూటర్లు...: భారత్‌లో వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా అత్యంత విలాసవంతమైన విస్పా స్టేబుల్, విస్పా 946 మోడళ్లను విడుదల చేయనున్నట్లు పియాజియో వెహికల్స్ చైర్మన్ రవి చోప్రా చెప్పారు. వీటి ధరల శ్రేణి రూ. 8-9 లక్షలు ఉండొచ్చని తెలిపారు. బహుశా రానున్న రెండుమూడు నెలల్లో ఇవి మార్కెట్లోకి అందుబాటులోకి రావచ్చన్నారు. దేశీయ మార్కెట్లో ప్రవేశించిన రెండేళ్లలోనే పియాజియో 70,000 వెస్పా స్కూటర్లను విక్రయించింది.