కేరళకు ట్రూజెట్‌ సాయం  | True jet aid to Kerala freely freight freight | Sakshi
Sakshi News home page

కేరళకు ట్రూజెట్‌ సాయం 

Aug 20 2018 1:07 AM | Updated on Aug 20 2018 1:07 AM

True jet aid to Kerala freely freight freight - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళ ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు విమానయాన సంస్థ ట్రూజెట్‌ ముందుకొచ్చింది. దాతలు ఇచ్చిన మందులు, దుస్తులు, ఆహారం మొదలైనవి కేరళకు ఉచితంగా, త్వరగా చేర్చేందుకు సిద్ధమైంది. హైదరాబాద్, చెన్నై నుంచి వీటిని సేకరించి మంగళ, బుధ, గురువారాల్లో త్రివేండ్రంకు చేర్చనుంది. తెలంగాణ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందించిన సామగ్రితో ఉదయం 5.30కి శంషాబాద్‌ నుంచి విమానం బయలుదేరి చెన్నైకి చేరుకుంటుంది.
 

తమిళనాడు ప్రభుత్వం సేకరించిన సామగ్రితో అక్కడి నుంచి త్రివేండ్రం వెళుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో వరదల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను ఉచితంగా చెన్నై, హైదరాబాద్‌కు తీసుకు రావాలని నిర్ణయించినట్టు ట్రూజెట్‌ సీఈవో విశోక్‌ మాన్‌సింగ్‌ ఆదివారం తెలిపారు. ప్రతిరోజు ఆరు టన్నుల సామగ్రిని చేరవేయగలమని, 65 మంది ప్రయాణికులను తీసుకువస్తామని ఆయన చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement