సోమవారం మార్కెట్లకు సెలవు | Today Markets Closed | Sakshi
Sakshi News home page

సోమవారం మార్కెట్లకు సెలవు

Mar 4 2019 2:02 PM | Updated on Mar 4 2019 2:02 PM

Today Markets Closed  - Sakshi

సాక్షి, ముంబై: మహాశివరాత్రి సందర్భంగా సోమవారం మార్కెట్లకు సెలవు. బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) పనిచేయవు. ట్రేడింగ్‌ తిరిగి మంగళవారం(5న) యథావిధిగా ఉదయం 9.15కు ప్రారంభమవుతుంది.

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల  నేపథ్యంలో గతవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీస్థాయిలో హెచ్చుతగ్గులను చవిచూశాయి. చివరికి శుక్రవారం సెన్సెక్స్‌ నికరంగా 192 పాయింట్లు(0.55 శాతం) బలపడి 36,064 వద్ద నిఫ్టీ 72 పాయింట్లు(0.7 శాతం) పుంజుకుని 10,863 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement