టాటా మోటార్స్ ‘టియాగో’ ధర పెరిగింది!! | Tata Motors hikes Tiago prices by up to Rs 6000 | Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్ ‘టియాగో’ ధర పెరిగింది!!

Aug 18 2016 12:42 AM | Updated on Sep 4 2017 9:41 AM

టాటా మోటార్స్ ‘టియాగో’ ధర పెరిగింది!!

టాటా మోటార్స్ ‘టియాగో’ ధర పెరిగింది!!

దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ తాజాగా తన హ్యాచ్‌బ్యాక్ కారు ‘టియాగో’ ధరను రూ. 6,000 వరకూ పెంచింది.

న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ తాజాగా తన హ్యాచ్‌బ్యాక్ కారు ‘టియాగో’ ధరను రూ. 6,000 వరకూ పెంచింది. కంపెనీ రూ.3.2 లక్షలు-రూ.5.6 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) పరిచయ ధరతో టియాగోను ఏప్రిల్‌లో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్, 1.05 లీటర్ రెవోటార్క్ డీజిల్ ఇంజిన్ అనే రెండు ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. టియాగోకు 30,000కు పైగా బుకింగ్స్ వచ్చాయని కంపెనీ పేర్కొంది. కాగా రూపాయి విలువ క్షీణత, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల వంటి పలు అంశాల కారణంగా ఇప్పటికే మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీలు వాటి వాహన ధరలను రూ.20,000 వరకూ పెంచాయి. ఇక ఫోర్డ్ కంపెనీ మాత్రం తన ‘ఆస్పైర్’, ‘ఫిగో’ కార్ల ధరలను రూ.91,000 వరకూ తగ్గించింది.

Advertisement
 
Advertisement
Advertisement