టాటా కార్లు.. తగ్గింపు ఆఫర్లు.. కర్వ్‌ ఈవీపై రూ.3.35 లక్షలు! | Tata Cars Festive Offers October 2026 Curvv EV Discount | Sakshi
Sakshi News home page

టాటా కార్లు.. తగ్గింపు ఆఫర్లు.. కర్వ్‌ ఈవీపై రూ.3.35 లక్షలు!

Oct 18 2026 1:42 PM | Updated on Oct 18 2026 1:50 PM

Tata Cars Festive Offers October 2026 Curvv EV Discount

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నవరాత్రి, దసరా పండుగల సందడి కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఎక్కువ మంది షాపింగ్‌ చేస్తుంటారు. బట్టలు, గృహోపకరణాలతోపాటు వాహనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి చాలా కంపెనీలు వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి.

నవరాత్రి, దసరా పండుగల సందర్భంగా టాటా మోటార్స్ తన కార్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ కార్లపై మోడల్‌, వేరియంట్‌ను బట్టి రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. వీటిలో క్యాష్‌ డిస్కౌంట్లు, లాయల్టీ బెనిఫిట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ప్రోత్సాహకాలు ఉన్నాయి.

టాటా టియాగోపై రూ.35,000 వరకు, టిగోర్‌పై రూ.30,000 వరకు, ఆల్ట్రోజ్ సీఎన్‌జీపై రూ.55,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. నెక్సాన్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపై రూ.75,000 వరకు, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.60,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. నెక్సాన్ ఈవీపై రూ.45,000 వరకు ప్రయోజనాలు అందిస్తోంది.

అలాగే ఎలక్ట్రిక్ కార్లపై కూడా టాటా ప్రత్యేక తగ్గింపులు ప్రకటించింది. పంచ్ ఈవీపై రూ.1.45 లక్షల వరకు, కర్వ్‌ ఐసీఈపై రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. కర్వ్‌ ఈవీపై అత్యధికంగా రూ.3.35 లక్షల వరకు పండుగ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. హారియర్ ఈవీపై రూ.2.75 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించింది.

ఇక హారియర్, సఫారీ పెట్రోల్‌/డీజిల్‌ శ్రేణిపై రూ.45,000 వరకు, టాటా సియెర్రాపై రూ.30,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. అయితే టాటా పంచ్ ఐసీఈ, ఏరీస్ మోడళ్లపై ఈ నెలలో ప్రత్యేక పండుగ ఆఫర్లు ప్రకటించలేదు. కొనుగోలుదారులు ఎంచుకునే వేరియంట్‌, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ అర్హత ఆధారంగా తుది ప్రయోజనాలు మారుతాయి. కాబట్టి కారు కొనుగోలు చేసే ముందు సమీప టాటా డీలర్‌ వద్ద ఆఫర్ల వివరాలు తెలుసుకోవడం మంచిది.

ఇదీ చదవండి: రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement