ప్రణబ్, మోదీలతో భేటీ కానున్న సుందర్ పిచాయ్ | Sundar Pichai to meet Modi, Pranab Mukerjee | Sakshi
Sakshi News home page

ప్రణబ్, మోదీలతో భేటీ కానున్న సుందర్ పిచాయ్

Dec 16 2015 2:46 AM | Updated on Aug 21 2018 9:33 PM

ప్రణబ్, మోదీలతో భేటీ కానున్న సుందర్ పిచాయ్ - Sakshi

ప్రణబ్, మోదీలతో భేటీ కానున్న సుందర్ పిచాయ్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విడిగా భేటీ కానున్నారు.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విడిగా భేటీ కానున్నారు. గూగుల్ సీఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా భారత్‌కు వస్తున్న సుందర్ పిచాయ్ బుధవారం మీడియాతో మాట్లాడతారు. తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లను కలుసుకుంటారు.

గురువారం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ క్యాంపస్‌లో విద్యార్థులతో కొంత సమయం గడుపుతారు. ఆ తరవాత మోదీతో భేటీ అవుతారు. అదే రోజు సాయంత్రం రాష్ట్రపతితో సమావేశమవుతారు. పిచాయ్ ఈ పర్యటనలో భాగంగా కొత్త ఆవిష్కరణలు ప్రకటించవచ్చని సమాచారం. చెన్నైకి చెందిన సుందర్ పిచాయ్ ఆగస్ట్‌లో గూగుల్ సీఈవోగా నియమితులైన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement