లాభనష్టాల ఊగిసలాట

Stockmarkets slips into Red - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరంభంలో 50పాయింట్లకు పైగాపుంజుకున్నాయి. అయితే వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, టెక్‌ నష్టాలు కీలక సూచీలను  ప్రభావితం చేస్తున్నాయి.   అంతర్జాతీమార్కెట్ల ప్రతికూల సంకేతాలతో వరుసగా నాలుగోరోజు కూడా లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న  సూచీల్లో సెన్సెక్స్‌ ప్రస్తుతం  12 పాయింట్ల లాభంతో 38,030 వద్ద,నిఫ్టీ 2 పాయింట్లు క్షీణించి 11,475వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఫార్మ, ఆటో సెక్టార్‌ లాభపడుతోంది.

టాటా మెటార్స్‌, సిప్లా, సన్‌పార్మ, అరబిందో  కోటక్‌ మహీంద్ర, ఎస్‌బ్యాంకు డెల్లా, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ లాభపడుతున్నాయి.  మరోవైపు జీ , విప్రో ఐసీఐసీఐ, వేదాంతా, భారతి ఇన్‌ప్రాటెల్‌, నష్టపోతున్నాయి. మరోవైపు దేశీయకరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది.  డాలరుమారకంలో 71.92 వద్ద కొనసాగుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top