భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 320 పాయింట్లు, నిఫ్టీ 120 పాయింట్లు లాభపడ్డాయి.
భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 320 పాయింట్లు, నిఫ్టీ 120 పాయింట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 26,450 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7,885 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. చైనా స్టాక్ మార్కెట్లు కూడా ఉదయం లాభాలతోనే ప్రారంభం అయ్యాయి.
మహారాష్ట్ర, హర్యానాలలో బీజేపీ భారీ విజయాలు సాధించడం కూడా భారత స్టాక్ మార్కెట్లకు మంచి సెంటిమెంటుగా మారింది. డీజిల్ ధరల మీద నియంత్రణను పూర్తిగా ఎత్తేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఒక్కసారిగా ఓఎన్జీసీ, హెచ్పీసీసెల్, ఐఓసీ, ఆయిల్ ఇండియా లాంటి ప్రభుత్వరంగ చమురు సంస్థల షేర్లు దూసుకెళ్తున్నాయి. ఇక రూపాయి కూడా 22 పైసలు లాభపడింది. ప్రస్తుతం డాలర్ విలువ 61.22 రూపాయలుగా ఉంది.