రూ.888 కే విమాన టికెట్‌ | SpiceJet offers flight tickets in Rs 888: Check out details | Sakshi
Sakshi News home page

రూ.888 కే విమాన టికెట్‌

Oct 25 2018 8:39 PM | Updated on Oct 25 2018 8:39 PM

SpiceJet offers flight tickets in Rs 888: Check out details - Sakshi


సాక్షి,ముంబై:  ఒక వైపు భారీగా పెరిగిన  ఇంధన ధరలు  విమానయాన  సంస్థలను ఇబ్బందిపెడుతున్నప్పటికీ   పండుగ సీజన్‌ను క్యాష్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.  ఇప్పటికే ఇండిగో దివాలీ సేల్‌ ప్రకటించగా తాజాగా మరో  లోకాస్ట్‌ ఎయిర్‌లైన్‌ స్పైస్‌ జెట్‌ కూడా డిస్కౌంట్‌ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది.  ప్రత్యేక దివాలీ సేల్‌ను ప్రారంభించింది.  అన్నీ చార్జీలు కలిపి ఒకవైపు ప్రయాణానికి రూ.888 ప్రారంభ ధరగా టికెట్లను అందిస్తోంది. ఆ ఆఫర్‌లో టికెట్లను బుక్‌ చేసుకునే గడువు అక్టోబర్‌ 28తో ముగియనుంది. ఇలా బుక్‌ చేసుకున్న  టికెట్లు నవంబర్‌ 8 నుంచి మార్చి 31, 2019వరకు చెల్లబాటు అవుతాయని స్పైస్‌ జెట్‌ ప్రకటించింది.

కాగా దేశీయ అంతర్జాతీయమార్గాల్లో ఇండిగోదివాల్‌ సేల్‌ను బుధవారం లాంచ్‌​ చేసింది. దేశీయంగా  రూ.899 ప్రారంభ ధరలో టికెట్లను ఆఫర్‌ చేసింది. ఇది అక్టోబర్‌ 24తో ముగిసింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement