ప్రభుత్వానికి సింగరేణి రూ.132 కోట్ల డివిడెండ్ | Singareni Rs.132 crore dividend | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి సింగరేణి రూ.132 కోట్ల డివిడెండ్

Jan 23 2015 2:24 AM | Updated on Sep 2 2017 8:05 PM

ప్రభుత్వానికి సింగరేణి రూ.132 కోట్ల డివిడెండ్

ప్రభుత్వానికి సింగరేణి రూ.132 కోట్ల డివిడెండ్

సింగరేణి కాలరీస్ సంస్థ (ఎస్‌సీసీఎల్) తెలంగాణా ప్రభుత్వానికి రూ.132 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది.

హైదరాబాద్: సింగరేణి కాలరీస్ సంస్థ (ఎస్‌సీసీఎల్) తెలంగాణా ప్రభుత్వానికి రూ.132 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. ఈ మొత్తాన్ని చెక్ ద్వారా ఎస్‌సీసీఎల్ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారని సింగరేణి కాలరీస్ ఒక ప్రకటనలో తెలిపింది. 2013-14లో కంపెనీ రూ.418 కోట్లు నికర లాభాన్ని అర్జించిందని సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ పేర్కొన్నారు. కంపెనీ ఉత్పత్తిలో రెండంకెల వృద్ధిని సాధించటానికి తగిన చర్యల్ని తీసుకుంటామని, పవర్ ప్లాంటు కార్యకలాపాలను షెడ్యూల్ ప్రకారం ప్రారంభించటానికి కృషి చేస్తానని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement