సెంచరీ లాభాలతో సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ షురూ..!

Sensex was up 100 points - Sakshi

10100 పై నిఫ్టీ ప్రారంభం

అప్రమత్తత అవసరం: మార్కెట్‌ విశ్లేషకులు

అంతంతమాత్రంగానే అంతర్జాతీయ సంకేతాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వారాంతపు చివరి రోజైన శుక్రవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 110 పాయింట్లు పెరిగి 34318 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 10134.60 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక్క ఐటీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిప్తోంది.  ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు అత్యధికంగా లాభపడుతున్నాయి. అలాగే మెటల్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ, అటో షేర్లకు చెప్పుకోదగిన స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 21వేల పైన 21,002 ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 

అప్రమత్తత అవసరం: మార్కెట్‌ విశ్లేషకులు
భారత్‌ - చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో నేడు భారత ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. కరోనా వైరస్‌ సంబంధిత వార్తలు, స్టాక్‌-ఆధారిత ట్రేడింగ్‌ మార్కెట్‌ మూమెంటంను నిర్దేశించే అవకాశం ఉంది. అలాగే పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, క్యాడిలా హెల్త్‌కేర్‌తో సుమారు 46 కంపెనీలు నేడు క్యూ4 ఫలితాలను విడుదల చేయనున్నాయి. వీటికి తోడు నేడు స్టాక్‌ మార్కెట్‌కు వారాంతపు రోజు కావడంతో ఇన్వెసర్లు లాభాల స్వీకరణకు పూనుకొనే అవకాశం ఉంది. ఈ పరిణామాల  దృష్ట్యా నేడు సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అంతంతమాత్రంగానే అంతర్జాతీయ సంకేతాలు:
ఇక అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అమెరికాలో నిన్న ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అయితే డోజోన్స్‌ సూచీల మాత్రం స్వల్ప నష్టాలను మూటగట్టుకుంది. నేడు ఆసియాలోనూ మిశ్రమ సంకేతాలు నెలకొన్నాయి. జపాన్‌, ఇండోనేషియా, తైవాన్‌, చైనా దేశాల స్టాక్‌ సూచీలు అరశాతం లాభాల్లో కదలాడుతున్నాయి. సింగపూర్‌, కొరియా, థాయిలాండ్‌, హాంగ్‌కాంగ్‌ సూచీలు అరశాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

జీ లిమిటెడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీస్‌ షేర్లకు 2శాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి. హీరోమోటోకార్ప్‌, ఎంఅండ్‌ఎం, విప్రో, హెచ్‌సీఎల్‌టెల్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 0.25శాతం నుంచి 1శాతం నష్టపోయాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top