వరుస నష్టాలకు బ్రేక్, లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ! | Sensex up in early trade, Snapping its four-day losing streak | Sakshi
Sakshi News home page

వరుస నష్టాలకు బ్రేక్, లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!

Jun 24 2014 10:07 AM | Updated on Sep 2 2017 9:20 AM

వరుస నష్టాలకు బ్రేక్, లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!

వరుస నష్టాలకు బ్రేక్, లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!

రిటైల్ ఇన్వెస్టర్లు, ఫండ్స్ కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో నాలుగు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి

హైదరాబాద్: రిటైల్ ఇన్వెస్టర్లు, ఫండ్స్ కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో నాలుగు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 260 పాయింట్ల లాభంతో 25287 పాయింట్ల వద్ద, నిఫ్టీ 65 పాయింట్ల వృద్దితో 7558 వద్ద ట్రేడ్ అవుతోంది. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో గెయిల్ అత్యధికంగా  2.84, సెసా గోవా 2.09, బ్యాంక్ ఆఫ్ బరోడా 1.85, హెచ్ డీఎఫ్ సీ 1.82, బీపీసీఎల్ 1.77 శాతం లాభపడ్డాయి. హెచ్ సీఎల్, కొటాక్ మహీంద్ర, ఇన్పోసిస్, సన్ ఫార్మా, ఓఎన్ జీసీ కంపెనీల షేర్లు స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement