భారీ నష్టాల్లో సెన్సెక్స్! | Sensex tanks heavily due to metal stocks dip | Sakshi
Sakshi News home page

భారీ నష్టాల్లో సెన్సెక్స్!

Aug 8 2014 12:53 PM | Updated on Sep 2 2017 11:35 AM

భారీ నష్టాల్లో సెన్సెక్స్!

భారీ నష్టాల్లో సెన్సెక్స్!

అంతర్తాతీయ మార్కెట్ల ప్రతికూల పవనాలు, మెటల్, కాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, కన్సూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు కుప్పకూలడంతో భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

హైదరాబాద్: అంతర్తాతీయ మార్కెట్ల ప్రతికూల పవనాలు, మెటల్, కాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, కన్సూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు కుప్పకూలడంతో భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 
 
శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన ప్రధాన సూచీలు మధ్యాహ్నం సమయానికి కూడా కోలుకోలేకపోయాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 280 పాయింట్ల నష్టంతో 25308 వద్ద, నిఫ్టీ 87 పాయింట్లు క్షీణించి 7561 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 
 
డీఎల్ఎఫ్, బీపీసీఎల్, ఎం అండ్ ఎం, సెసా స్టెరిలైట్, భెల్ కంపెనీలు 3 శాతానికి పైగా నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, హెచ్ సీఎల్ టెక్, ఐటీసీ, టీసీఎస్ కంపెనీలు స్వల్పంగా లాభపడ్డాయి. 

Advertisement
 
Advertisement
Advertisement