నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ | Sensex, NIfty trading in Red | Sakshi
Sakshi News home page

నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

Aug 6 2014 12:57 PM | Updated on Sep 2 2017 11:28 AM

నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలత, రిటైల్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఒడిగట్టడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలత, రిటైల్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఒడిగట్టడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి సెన్సెక్స్ 81 పాయింట్లు క్షీణించి 25827, నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 7718 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో భెల్, ఇన్పోసిస్, పవర్ గ్రిడ్, ఎషియన్ పెయింట్స్, ఎంఅండ్ ఎం కంపెనీల షేర్లు ప్రధాన సూచీలుకు మద్దతుగా నిలువగా, టాటా మోటార్స్, అల్ట్రా టెక్ సిమెంట్స్, భారతీ ఎయిర్ టెల్, ఓఎన్ జీసీ, అంబుజా సిమెంట్స్ కంపెనీలు సూచీలను నష్టాల వైపు లాగాయి. 

Advertisement
 
Advertisement
Advertisement