సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో పాటు రూపాయి బలపడడం కూడా తోడవడంతో
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా లాభాలతో ప్రారంభం అయ్యాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో పాటు రూపాయి బలపడడం కూడా తోడవడంతో ఆరంభంలోనే ట్రేడింగ్ అదిరింది. ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 62 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 24,463.41 పాయింట్లు దాటగా, నిఫ్టీ 7,427.10 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇక రూపాయి కూడా ప్రారంభంలోనే పుంజుకుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.67.54గా ఉంది.