స్వల్ప లాభాల్లో సెన్సెక్స్! | Sensex in Green, Auto stocks surge | Sakshi
Sakshi News home page

స్వల్ప లాభాల్లో సెన్సెక్స్!

Aug 27 2014 1:14 PM | Updated on Mar 9 2019 4:28 PM

స్వల్ప లాభాల్లో సెన్సెక్స్! - Sakshi

స్వల్ప లాభాల్లో సెన్సెక్స్!

ఆటో రంగ కంపెనీల షేర్లు లాభాల పట్టడం, గ్లోబల్ మార్కెట్లలో సానుకూలత అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఆటో రంగ కంపెనీల షేర్లు లాభాల పట్టడం, గ్లోబల్ మార్కెట్లలో సానుకూలత అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 111 పాయింట్ల లాభంతో 26554, నిఫ్టీ 29 పాయింట్ల వృద్దితో 7933 వద్ద కొనసాగుతున్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో 26599 పాయింట్ల, నిఫ్టీ 7,946 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకాయి. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో హెచ్ సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్ జీసీ, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్ లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎన్ టీపీసీ, భెల్, కొటాక్ మహీంద్ర, సెసా స్టెర్ లైట్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement