భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్సెక్స్ 28వేల స్థాయిని అధిగమిస్తే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 8,400 మార్క్ పాయింట్లను దాటింది. రికార్డ్ స్థాయిలో స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 28,260.66 వద్దకు, నిఫ్టీ 8,447.40 వద్దకు చేరింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఇక రూపాయి కూడా 8 పైసలు నష్టపోయింది. ప్రస్తుతం డాలర్ విలువ 61.81గా ఉంది.