ఎఫ్‌డీలపై ఎస్‌బీఐ శుభవార్త | SBI hikes fixed deposit interest rates | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీలపై ఎస్‌బీఐ శుభవార్త

Nov 28 2018 2:59 PM | Updated on Apr 4 2019 5:22 PM

SBI hikes fixed deposit interest rates - Sakshi

సాక్షి, ముంబై: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు శుభవార్త అందించింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. ఈ  సవరించిన వడ్డీ రేట్లు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. 

పెంచిన వడ్డీ రేటు 0.05-0.10 శాతం లేదా 5- 10 బేసిస్ పాయింట్లు మధ్య ఉంటుంది.  కోటి రూపాయల లోపు ఫిక్స్‌డ్‌  డిపాజిట్ల మాత్రమే పెంచిన రేట్లు వర్తిస్తాయి. మరిన్ని వివరాలు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో  లభ్యం. మరో వారం రోజుల్లో ఆర్‌బీఐ పాలసీ రివ్యూ జరగనున్న నేపథ్యంలో ఎస్‌బీఐ డిపాజిట్లపై వడ్డీరేటు పెంపును  ప్రకటించడం  గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement