ఆయన్ను యాపిల్ లాగేసుకుందా? | Samsung top executive to be Apple India media head | Sakshi
Sakshi News home page

ఆయన్ను యాపిల్ లాగేసుకుందా?

May 19 2016 10:54 AM | Updated on Aug 20 2018 2:55 PM

ఆయన్ను యాపిల్ లాగేసుకుందా? - Sakshi

ఆయన్ను యాపిల్ లాగేసుకుందా?

శాంసంగ్ కు చెందిన అతి ముఖ్యమైన ఉద్యోగిని యాపిల్ తన వైపు లాక్కుంది. మీడియా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగానికి ఉపాధ్యక్షుడు, మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న,రాజీవ్ మిశ్రాను యాపిల్ నియమించుకుంది

న్యూఢిల్లీ: దేశంలో స్మార్ట్ ఫోన్ వ్యాపారంలో నువ్వానేనా అంటూ  పోటీపడుతున్న దిగ్గజ టెక్ కంపెనీలు శాంసంగ్, యాపిల్ మధ్య  ఆసక్తికర పరిణామం చోటు  చేసుకుంది.  శాంసంగ్ కు చెందిన అతి ముఖ్యమైన ఉద్యోగి ఒకర్ని యాపిల్ తన వైపు లాక్కుంది.   శాంసంగ్ లో మీడియా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగానికి ఉపాధ్యక్షుడు, మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న,రాజీవ్ మిశ్రాను యాపిల్  నియమించుకుంది. యాపిల్ ఇండియా మీడియా హెడ్ గా ఆయన్ను   రిక్రూట్ చేసుకుంది. ఈ నియామకాన్ని మిశ్రా మీడియాకు  బుధవారం ధృవీకరించారు.

లోక్ సభ టీవీకి సీఈవోగా పనిచేసిన మిశ్రా , హిందూస్తాన్ టైమ్స్ గ్రూప్, స్టార్ TV, జీ టీవీ, రిలయన్స్ ఇన్ఫోకాం లిమిటెడ్, న్యూస్ 24  తదితర వివిధ జాతీయ  ఛానల్స్  కు పనిచేసిన అపార అనుభవం ఉంది. దీంతోపాటు వివిధ మంత్రిత్వ,  మీడియా సలహా విభాగాలకు నామినేటెడ్ సభ్యుడిగా ఉన్నారు.  అంతేకాదు ఎలక్ట్రానిక్ మీడియా రేటింగ్ కౌన్సిల్  ఆఫ్ ఇండియాకి ఆద్యుడు మిశ్రా.

కాగా  ఆపిల్ సీఈవో టిమ్ కుక్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి విచ్చేసిన సందర్భంగా చోటు చేసుకున్న  ఈ మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ అమ్మకాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కంపెనీ సీఈవో వరుసగా చైనా, భారత్ లలో పర్యటిస్తున్నారు.  తద్వారా పడిపోయిన తమ మార్కెట్ ను తిరిగి పునరుద్ధరించుకునే పనిలో పావులు కదుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement