భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్‌సంగ్.. తన జాతీయ విద్యా కార్యక్రమం ‘శామ్‌సంగ్ సాల్వ్ ఫర్ టుమారో 2025’ నాల్గవ ఎడిషన్ విజేతలను ప్రకటించింది. ఈ కార్యక్రమం యువ విద్యార్థులు సాంకేతికతను వినియోగించి తమ స్థానిక కమ్యూనిటీల్లోని వాస్తవ ప్రపంచ సవాళ్లకు సృజనాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుంది.
మొదటి నాలుగు విజేత జట్లు
పెర్సెవియా (బెంగళూరు)
నెక్ట్స్‌ప్లే.ఏఐ (ఔరంగాబాద్)
పారస్పీక్ (గురుగ్రామ్)
పృథ్వీ రక్షక్ (పలాము)
ఐఐటి ఢిల్లీకి చెందిన ఎఫ్ఐటీటీ ల్యాబ్స్‌లో మెంటర్‌షిప్ మద్దతుతో, తమ ఆవిష్కరణాత్మక ప్రోటోటైప్లను స్కేలబుల్ రియల్-వరల్డ్ పరిష్కారాలుగా అభివృద్ధి చేయడానికి రూ. 1 కోటి విలువైన ఇంక్యుబేషన్ గ్రాంట్లు అందుకున్నారు. జ్యూరీ ప్యానెల్‌లో.. శామ్‌సంగ్ మాత్రమే కాకుండా, విద్యా సంస్థలు, ప్రభుత్వం & పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్యానెల్ నాలుగు ప్రధాన నేపథ్య ట్రాక్లలో ఫైనలిస్టుల పరిష్కారాలను అంచనా వేసింది.
అత్యుత్తమ ప్రపంచాన్ని నిర్మించడంలో తమ సృజనాత్మకత & అంకితభావాన్ని ప్రతిబింబించినందుకు టాప్ 20 ఫైనలిస్ట్ జట్లు ఒక్కొక్కటి రూ 1 లక్ష నగదు బహుమతితో పాటు తాజా శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా అందుకున్నాయి. అదనంగా, ఈ కార్యక్రమం ఐదు ప్రత్యేక అవార్డుల కింద బహుమతులను అందించింది


