ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో డిజిటల్ కీ ఫీచర్‌ను అందించేలా మహీంద్రా అండ్ మహీంద్రా, శాంసంగ్ జట్టు కట్టాయి. ఈ భాగస్వామ్యం కింద శాంసంగ్ వాలెట్‌తో మహీంద్రా ఈఎస్‌యూవీలను అనుసంధానం చేస్తారు. దీనితో ఫిజికల్ కీ అవసరం లేకుండా డిజిటల్‌గానే కారును లాక్, అన్‌లాక్ చేసేందుకు వీలవుతుంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీ వల్ల ఒకవేళ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ మొత్తం అయిపోయినా కూడా డిజిటల్ కీ పని చేస్తుందని శాంసంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ మధుర్ చతుర్వేది తెలిపారు.
ఈ ఫీచర్ అంతర్గతంగా పొందుపర్చిన మహీంద్రా ఈఎస్‌యూవీ అమ్మకాలు నవంబర్ నుంచి ప్రారంభమవుతాయని, దశలవారీగా ప్రస్తుతమున్న ఇతర కార్లకు కూడా దీన్ని విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. 2020 తర్వాత ప్రవేశపెట్టిన గెలాక్సీ జెడ్, ఎస్ సిరీస్ డివైజ్‌ల్లో శాంసంగ్ వాలెట్ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుంది. ఎ సిరీస్ డివైజ్‌లలో కూడా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది. ప్రస్తుత కార్ ఓనర్లు.. మహీంద్రా సరీ్వస్ సెంటర్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
భారత్‌లో విక్రయించే బీఎండబ్ల్యూ, బీవైడీ, మెర్సిడెస్ బెంజ్ లాంటి విదేశీ కార్లలో ఇప్పటికే డిజిటల్ కీస్ సదుపాయం ఉండగా, ఈ ఫీచరును అందించే తొలి భారతీయ ఆటోమొబైల్ కంపెనీగా మహీంద్రా నిలుస్తుంది. డిజిటల్ కార్ కీ కోసం శాంసంగ్‌తో జట్టు కట్టడంపై మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్ డివిజన్) నళినికాంత్ గొల్లగుంట హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు


